తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన విశ్వక్ సేన్మూవీ తోనే మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అశ్విత్ మరిమత్తు దర్శకత్వం వహించగా , మిథాలీ పాల్కర్ ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటించింది.  లియోన్ జామ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అని రేంజ్ లో అలరించింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొన్ని రోజుల క్రితం నుండే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన "గుండెల్లోన" అనే పాటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఓరి దేవుడా మూవీ యూనిట్ గుండెల్లోన అనే సాంగ్ పూర్తి వీడియో సాంగ్ ను విడుదల చేసింది. మరి ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: