మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా ధమాకా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం నటించగా , శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది  ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు.

అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. వీటితో పాటు ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కకపోయే ఒక మూవీ లో కూడా రవితేజ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఈగల్ అనే టైటిల్ మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయం సాధించిన మానాడు మూవీ ని తెలుగు లో రవితేజ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో రవితేజ హీరో పాత్రలో కనిపించనుండగా ,  విలన్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తమిళ మానాడు మూవీ లో శింబు హీరోగా నటించగా , ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. వెంకట్ ప్రభు "మానాడు" మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: