సినిమా రంగాన్ని కెరీర్ గా ఎంచుకుని ఎన్నో సాహసాలు చేసి సక్సెస్ అయిన ఎంతోమందిని మనము చూశాము. కానీ వీరి సక్సెస్ వెనుక ఎన్ని కష్టాలు, బాధలు , కన్నీళ్లు , ప్రయోగాలు ఉంటాయన్నది వారికి మాత్రం తెలుస్తుంది. ఒక హీరోకు అయితే వరుస హిట్ లు వస్తేనే ఇక్కడ గౌరవం ? అదే డైరెక్టర్ కు కూడా అదే వర్తిస్తుంది. కానీ కొందరు మాత్రం ఎలా చేస్తారు అంటే డ్యూయల్ రోల్ చేస్తుంటారు. అంటే హీరో మరియు డైరెక్టర్ గా, అలాంటప్పుడు హీరోగా ఫెయిల్ అయితే డైరెక్టర్ గా ట్రై చేయొచ్చు ? డైరెక్టర్ గా ఫెయిల్ అయితే హీరోగా చేసుకోవచ్చు. అదే విధంగా ఒక డైరెక్టర్ హీరోగా మరి చేసిన సినిమా "లవ్ టుడే". ఇందులో ప్రదీప్ రంగనాధన్ హీరోగా మరియు ఇవానా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు ప్రదీప్ రంగనాధన్ దర్శకత్వం వహించడం విశేషం.

ఇటీవల తమిళ్ లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పటి వారికి ఏ డైరెక్టర్ టచ్ చేయని ఒక మంచి కాన్సెప్ట్ తో మనం ముందుకు వచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇద్దరు లవర్స్ కొన్ని రోజులు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుని కలిసి బ్రతకాలని ఆశపడతారు. ఇక ఎప్పటిలాగే ఈ విషయం ఇరు కుటుంబాలలో తెలియచేస్తారు. హీరో ఇంట్లో అందరూ ఇందుకు సమ్మతం తెలిపినా , హీరోయిన్ నాన్న మాత్రం ఒక షరతు పెడతారు. ఇక్కడే అసలైన ట్విస్ట్... ఈ ఒక్క పాయింట్ తో సినిమా ఫలితం తేలిపోయిందంటే నమ్మండి. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి ? హీరోయిన్ తండ్రి పెట్టిన షరతు ఏమిటంటే ఒకే ఒక్క రోజు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ తమ ఫోన్ లను మార్చుకుని... పక్కరోజు నా ముందు నిలబడి పెళ్లి చేసుకుంటాం అంటే అలాగే చేస్తాను అని చెబుతాడు.

అయితే ఇది అంత ఈజీ కాదని వారికి కూడా తెలుసు. కానీ అలా మార్చుకున్న రోజు జరిగిన పరిణామాలు ఏమిటి అన్నది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ తెలుగులో అనువదిస్తున్నాడు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. మరి ఈ కొత్త కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకుల మనసును మెప్పిస్తుందా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో లాగా ఇప్పుడు ఉన్న లవర్స్ ఒక్క రోజు తమ ఫోన్ లు మార్చుకునే దైర్యం ఉందా ? ఒక్క రోజు కాదు కదా ఒక్క గంట కూడా మార్చుకోరని ఖచ్చితంగా చెప్పగలం.      

 

మరింత సమాచారం తెలుసుకోండి: