తాజాగా గత కొన్ని రోజుల నుంచి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో సంక్రాంతి పండుగకు సినిమాల విడుదల విషయంపై పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలను తెలుగులో విడుదల చేయడానికి వీలులేదు అని తెలుగు నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే కోలీవుడ్ లో కూడా తెలుగు చిత్రాల విడుదలను అడ్డుకుంటామని కోలీవుడ్ నిర్మాతల మండలి స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాతలు ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు.


ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం వారిసు.. తెలుగులో వారసుడు పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుండగా ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగులో డబ్బింగ్ చిత్రాలను సంక్రాంతి భరి నుంచి తప్పిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే విజయ్ నటిస్తున్న చిత్రాన్ని కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను సంక్రాంతి భరి నుంచి తప్పించాలా? లేకపోతే దింపాల అనే విషయంపై..ఈ రోజు చెన్నైలో విజయ్ మరియు దిల్ రాజు సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు.


ఇప్పటికే తెలుగులో సంక్రాంతి భరిలో చిరంజీవి భోళాశంకర్ , బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు పోటీపడుతున్న నేపథ్యంలో విజయ్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు నిర్మాతలు.  మరి ఈ విషయంపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?  విజయ్ సినిమా సంక్రాంతి భరి నుంచి తప్పుకున్నట్లేనా? అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: