బుల్లితెర యాంకర్లు గా కొనసాగుతున్న భామలు వారి ఇమేజ్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పటికే అషు రెడ్డి తన అందాల తాకిడితో హంగామా చేస్తుంటే ఆమె చాలదు అన్నట్టు ఇప్పుడు మరో బుల్లితెర భామ స్కిన్ షో చేస్తుంది. అషు బాటలో నడుస్తూ కామెడీ స్టార్స్ యాంకర్ దీపిక పిల్లి కూడా మాల్దీవ్స్ లో బికినీ తో బీభత్సం సృష్టిస్తుంది. మాల్దీవ్స్ లో బోట్ షికారులో పసందైన అందాల విందు అందిస్తుంది దీపిక. టిక్ టాక్ తో పాపులర్ అయ్యి.. ఈటీవీ ఢీ షోతో ఛాన్స్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కామెడీ స్టార్స్ లో చేస్తుంది.

ఇదే కాదు ఆహా వారు చేస్తున్న కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లో కూడా సుధీర్ తో పాటు యాంకరింగ్ చేస్తుంది. యాంకర్ గా అలరిస్తూనే దీపికా తన హాట్ షోతో కుర్రాలని అలరిస్తుంది. ముఖ్యంగా అషు దారిలోనే అమ్మడు అందాల ప్రదర్శన చేస్తుంది. అసలు ఇంతకీ ఈ భామలు ఈ రేంజ్ లో రెచ్చిపోవడం వెనక కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు. కామెడీ స్టార్స్ తో పాపులర్ అయిన దీపిక శ్రీధర్ సీపాన డైరక్షన్ లో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాలో సుధీర్ కి జోడీగా నటించింది దీపిక.

ఓ పక్క సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఇలా ఫోటో షూట్స్ తో కూడా దీపిక తన సత్తా చాటుతుంది. అషు రెడ్డి వేసిన బాటలో నడవాలని ఫిక్స్ అయింది అనుకుంటా అందుకే అమ్మడు మాల్దీవ్స్ లో బికినీ షోతో బీభత్సం సృష్టిస్తుంది. దీపిక పిల్లి ఇవన్ని సినిమా అవకాశాల కోసమే చేస్తుందా లేదా అన్నది చూఒడాలి. దీపిక చేస్తున్న ఈ గ్లామర్ షో తన ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఫోటో షూట్స్ వల్ల ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: