పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు.. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. సినిమా మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ సంతోషం లో మునిగి తెలుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండటం తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.. అందుకే ఎప్పుడూ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.


ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమా పై నెలకొన్న అంచనాల ను రెట్టింపు చేశాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వార్ ఎపిసోడ్స్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌ లో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా బుధవారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్‌ను చిత్రీకరించేందుకు క్రిష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌షాప్ కూడా నిర్వహించాడట దర్శకుడు.. క్లైమాక్స్ అనేది పూనకాలు తెప్పించెలా వుండాలని,అప్పుడు మంచి హిట్ ను అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.


ఈ క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ లో పవన్ కల్యాణ్‌ తో పాటు చాలా మంది నటీనటులు పాల్గొంటారట. ఈ సినిమా లో హీరోయిన్‌గా అందాల భామ నిధి అగర్వాల్ నటిస్తోండగా ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏఎం. రత్నం అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.. ఇప్పటి వరకూ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. పవన్ రాజకీయాల్లొ చురుగ్గా ఉండటం ఇందుకు కారణమని తెలుస్తుంది. రానున్న ఎన్నికలపై పవన్ ఫోకస్ పెట్టారు. అందుకే సినిమాలకు కొన్ని డేట్స్ ఇచ్చి, అందులోనే పూర్తీ చెయ్యాలని సినీ నిర్మాతలకు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: