తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలిస్తే , మరి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపర్చాయి. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదల అయితే అందులో కొన్ని మాత్రమే ఎప్పటికీ మిగిలి పోయే క్లాసిక్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి.  అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి వరకు వచ్చిన అద్భుతమైన క్లాసిక్ సినిమాలలో శంకరాభరణం సినిమా ఒకటి. 1980 వ సంవత్సరం లో విడుదల అయిన శంకరాభరణం సినిమా ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా , కలెక్షన్ ల వర్షాన్ని కూడా కురిపించింది. అలాగే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

అలాగే ఈ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. శంకరాభరణం లాంటి క్లాసిక్ మూవీ కి గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్ కె  విశ్వనాథ్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో జే వీ సోమయాజులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ద్వారా దర్శకుడి గా కె  విశ్వనాథ్ కు , నటుడి గా కే జీ సోమయాజులకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచిన శంకరాభరణం సినిమాకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. 53 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 లో ఇండియన్ క్లాసికల్ విభాగంలో శంకరాభరణం సినిమాను ఎంపిక చేశారు. దీంతో గోవా లో జరగనున్న ఫిలిం ఫెస్టివల్ క్లాసికల్ విభాగం లో శంకరాభరణం సినిమాని ప్రదర్శించనున్నారు. ఇలా తాజాగా శంకరాభరణం మూవీ కి అరుదైన గౌరవం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: