సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోందని చెప్పాలి. అయితే ఈ సినిమాలకు బీజం పోసింది మాత్రం మహేష్ బాబు అభిమానులే.. మహేష్ బాబు నుంచి సినిమా ప్రకటన రాకపోవడంతో ప్రేక్షకులు మహేష్ బాబును మర్చిపోకుండా ఉండడానికి .. మహేష్ బాబు అభిమానులు ఊహించని విధంగా పోకిరి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఊహించని రేంజ్ లో భారీ కలెక్షన్స్ వసూలు చేశారు. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఫాలో అవుతూ చిరంజీవి ,పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల పుట్టినరోజు నాడు కూడా వారి కెరియర్ లో భారీ విజయాన్ని అందించిన సినిమాలను రీ రిలీజ్ చేసి మరొకసారి కలెక్షన్లు సృష్టించారని చెప్పవచ్చు.


అయితే రీ రిలీజ్ సినిమా మంచి విజయం సాధించిన సినిమా అయితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నా విషయం తెలిసిందే . కానీ రజనీకాంత్ సినిమా విషయంలో మాత్రం ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  అసలు విషయంలోకి వెళ్తే ఈ రోజు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్ లలో రజనీకాంత్ ఫ్లాప్ సినిమాలలో ఒకటైన బాబా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కథపరంగా బాగున్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే ఈ సినిమాను ఈరోజు రీ రిలీజ్ చేయబోతుండడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. ఇప్పటికే ఈ సినిమాతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు డిసెంబర్ 12వ తేదీ కూడా బాబా సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతుండడంతో పూర్తిస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.  మరి అభిమానుల ఆలోచనలకు తగ్గట్టుగా సినిమాను రీ రిలీజ్ చేస్తే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది కానీ రజనీకాంత్ సినిమాలలో భారీ ఫ్లాప్ అయిన బాబా సినిమానే నిర్మాతలు రిలీజ్ చేస్తుండడంతో అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . కనీసం ఇప్పటికైనా బాబా సినిమాకు బదులుగా వేరే సినిమాను రిలీజ్ చేయాలని కూడా కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: