అయితే రీ రిలీజ్ సినిమా మంచి విజయం సాధించిన సినిమా అయితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నా విషయం తెలిసిందే . కానీ రజనీకాంత్ సినిమా విషయంలో మాత్రం ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈ రోజు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్ లలో రజనీకాంత్ ఫ్లాప్ సినిమాలలో ఒకటైన బాబా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కథపరంగా బాగున్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే ఈ సినిమాను ఈరోజు రీ రిలీజ్ చేయబోతుండడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. ఇప్పటికే ఈ సినిమాతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు డిసెంబర్ 12వ తేదీ కూడా బాబా సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతుండడంతో పూర్తిస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల ఆలోచనలకు తగ్గట్టుగా సినిమాను రీ రిలీజ్ చేస్తే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది కానీ రజనీకాంత్ సినిమాలలో భారీ ఫ్లాప్ అయిన బాబా సినిమానే నిర్మాతలు రిలీజ్ చేస్తుండడంతో అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . కనీసం ఇప్పటికైనా బాబా సినిమాకు బదులుగా వేరే సినిమాను రిలీజ్ చేయాలని కూడా కోరుతున్నారు.