
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ పై రకరకాల వార్తలు అయిన విషయం తెలిసిందే.. అప్పుడు వస్తాడు.. ఇప్పుడు వస్తాడు.. కథ సిద్ధమైంది.. డైరెక్టర్ అతడే.. హీరోయిన్ ఈమె.. అంటూ ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే . కానీ మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకు ఒక క్లారిటీ కూడా రాలేదు. కానీ ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడం జరిగింది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో ఒక రిపోర్టర్ మీ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? అని ప్రశ్నించగా.. బాలయ్య మాట్లాడుతూ.. "మోక్షజ్ఞను వచ్చే ఏడాది తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను.. నా కొడుకు వస్తున్నాడు "అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి కొడుకు ఎంట్రీ పై ప్రకటించాడు.
మొత్తానికి అయితే అటు బాలకృష్ణ ఇటు అభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఇకపోతే డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందా? అని అడగగా అంత దైవ నిర్ణయం అంటూ తెలిపాడు. అంతేకాదు మరొకవైపు అఖండ -2 కూడా ఉంటుందని స్పష్టం చేశాడు.