
ముఖ్యంగా విలన్ విసిరిన ఛాలెంజ్ ను మరియు చిక్కుముళ్లను విప్పుకుంటూ అతన్ని చేరుకునే మార్గంలో పోలీసుగా అడవి శేష్ అద్భుతమైన నటన కనబరిచాడు. అడవి శేష్ సినిమాకు తగినట్లుగా నటనతో ఆకట్టుకుంటూ అభిమానుల గుండెల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నాడు. మాములుగా ఇంతకు ముందు అడవి శేష్ నటించిన ఎవరు, గూఢచారి , ఎవరు, మేజర్ చిత్రాలలో లాగానే నటనలో వేలెత్తి చూపడానికి ఏమీ లేదు. ఇక డైరెక్టర్ శైలేషు కొలను కూడా కథ పరంగా స్క్రీన్ పరంగా మైనస్ లు లేకుండా చూసుకున్నాడు. అయితే పబ్లిక్ టాక్ ప్రకారం కొన్ని మైనస్ లు ఉన్నాయంటూ వినిపిస్తోంది. అవి కనుక లేకుండా ఉండి సినిమా ఇంకా బాగుండేదని తెలుస్తోంది.
ప్రధానంగా చెప్పుకుంటే... ట్రైలర్ చూసినప్పుడు హత్యకు సంబంధించిన ఫొటోస్ ను చూపించడం వలన ప్రేక్షకుడు థియేటర్ లో చూసి ఫీల్ అవ్వాల్సిన థ్రిల్ ను ట్రైలర్ చుసిన సమయంలోనే పొందుతారు. దానితో ఈ సీన్ ఇంతేనా అన్న ఫీల్ కలిగిందని తెలుస్తోంది. ఇక ఇది మాత్రమే కాకుండా... హంతకులను అడవి శేష్ మీవి కోడి బుర్రలు అని అనడం లాంటి ఎక్స్ ఫ్యాక్టర్స్ ను ట్రైలర్ లో చూపించకుండా ఉంటే థియేటర్ లో ఎక్కువ ఎంజాయ్ చేసే ఆకాశం ఉండేది. సినిమాకు కీలకంగా మారిన విలన్ హత్యలు చేయడం అన్న మోటో వెనుక బలమైన కరణ లేకపోవడం, అది ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా లేకపోవడం మైనస్ అని చెప్పాలి. ఇక ప్రేక్షకుడు ఊహించే సీన్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , విలన్ ఈ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లయిమాక్స్ విషయంలో డైరెక్టర్ ను అభినందించకుండా ఉండలేము.
ఫైనల్ గా చెప్పుకోవాలంటే సినిమా బాగుంది కానీ.. ఇంత హైప్ వచ్చాక ఆ స్థాయిలో సినిమా లేకపోవడం ఒక్కటే.