తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మేర్లపాక గాంధీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని , టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తరువాత ఎక్స్ ప్రెస్ రాజా మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మేర్లపాక గాంధీ "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరో గా నటించగా మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఫారియ అబ్దుల్లా ఈ మూవీ లో సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటించింది. 

మూవీ కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి సోనీ లివ్ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని సోనీ లీవ్ సంస్థ డిసెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: