తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తలపతి విజయ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తలపతి విజయ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న మూవీ లలో మేర్షల్ మూవీ ఒకటి. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అట్లీ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , నిత్య మీనన్ , దళపతి విజయ్ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ తెలుగు లో అదిరింది పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. 

మూవీ ద్వారా దర్శకుడు అట్లీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది. ఇలా తమిళ్ మరియు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెలుగు వర్షన్ ను మళ్లీ హైదరాబాద్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకారం కూడా వెలువడింది. అసలు విషయం లోకి వెళితే ... దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన అదిరింది మూవీ ని హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లలో డిసెంబర్ 4 వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్పెషల్ షో వేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే అదిరింది మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా , ఎస్ జె సూర్య , వడివేలు , సత్యరాజ్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: