తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అజిత్ ప్రస్తుతం తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  జీబ్రాన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా తునివు మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ మూవీ నుండి "చిల్ల చిల్ల" అంటూ సాగే మొదటి పాటను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: