తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సినీ తారలు తాతలు, తండ్రుల పేరు చెప్పుకొని వచ్చిన వారు ఉన్నారు. ఇక ఆ తర్వాత కష్టపడి పైకే దిగారు. అయితే ఇలా ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోలతో పోల్చి చూస్తే మాత్రం ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి క్రేజ్ తక్కువ అని చెప్పాలి. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చి అప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరో లుగా ఉన్నవారందరిని వెనక్కినట్టే నెంబర్ వన్ హీరోగా హవా నడిపించారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఇప్పటికీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారికి స్ఫూర్తిగానే నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఏకంగా రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన  స్టార్ హీరో చిరంజీవి ఇప్పుడు ఆరుపదుల వయస్సు దాటిపోతున్న కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ వచ్చి వరుస సినిమాలు చేస్తున్న తన కొడుకు చరణ్కే పోటీ ఇచ్చే విధంగా చిరంజీవి ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు.


 ఇదిలా ఉంటే చిరంజీవి ఇండస్ట్రీలోకి రాకముందు నేవీలో పనిచేశారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఇక ఈ విషయం గురించి తెలిసి ప్రస్తుతం అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటీవల మెగాస్టార్ తన సోషల్ మీడియాలో నేవీ వాళ్లకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఏకంగా కాలేజీ డేస్ లో నేవీ డ్రెస్సు వేసుకొని దిగిన ఫోటోని షేర్ చేశారు చిరంజీవి.  దీంతో చిరు ఇండస్ట్రీకి రాకముందు నేవీలో పనిచేసారా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల గోవా ఎయిర్ పోర్టులో కొంతమంది నేవీ ఆఫీసర్లు చిరంజీవిని కలిసి ఫోటో దిగారట. ఇక వారిని చూడగానే చిరంజీవికి తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయట. దీంతో కాలేజీలో ఎన్సిసి  క్యాండెట్ గా ఉన్నా సమయంలో 1976లో గణతంత్ర దినోత్సవం లో మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నరట చిరంజీవి. అప్పుడు నేవీ డ్రెస్ వేసుకున్న ఫోటోని పోస్ట్ చేయడంతో ఇక ఈ చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: