తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఆఖరుగా వలిమై అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. బోనీ కపూర్మూవీ ని నిర్మించగా , హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ "తునీవు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో "తెగింపు" అనే టైటిల్ తో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు , ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: