కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తలపతి విజయ్ ఆఖరుగా బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బీస్ట్ మూవీ తో ఆవరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. తమిళం లో రూపొందుతున్న ఈ మూవీ కి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. 

రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ నుండి ది తలపతి అనే సాంగ్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ 15 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: