నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఛలో సినిమాతో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఈమె అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి పాపులారిటీని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా సినిమా పుష్ప లో డీ గ్లామరస్ పాత్ర పోషించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు చిత్రాలతో పాటు తమిళ్ చిత్రాలతో బిజీగా దూసుకుపోతోంది.

ఇటీవల విజయ్ దళపతి తో రష్మిక మందన్న నటించిన సినిమా వరిసు తెలుగులో వారసుడు పేరిట ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోతో పాటు మరి ఎంతోమంది ప్రమోషన్స్ చేపడుతున్నారు.  కానీ ఈ ప్రమోషన్స్ కి రష్మిక మందన్న రాకపోవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రష్మిక మందన్న ప్రస్తుతం మిషన్ మజ్ను సినిమా షూటింగ్లో బిజీగా ఉంది . ఈ కారణంగానే వరిసు సినిమా ప్రమోషన్స్ కి ఆమె హాజరు కావడం లేదని సమాచారం. హిందీలో స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శంతను బాగ్చీ దర్శకత్వం వహిస్తున్నారు. రోని స్క్రూవాలా, అమర్ బుటాల మరియు గరిమా మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం భారతదేశం యొక్క గొప్ప రహస్య ఆపరేషన్ యొక్క అన్ టోల్డ్ స్టోరీ గా వర్ణించబడింది. ఈ సినిమా 2023 జనవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: