ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస విజయాలతో ఫుల్ జోష్ ను చూపిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో ఎన్నో ముఖ్య పాత్రలలో నటించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించగా , మరికొన్ని సినిమాలు అపజయాలను సాధించాయి. కాకపోతే అడవి శేషు కు ఆ మూవీ ల ద్వారా తగినంత గుర్తింపు లభించలేదు. అలాంటి సమయం లోనే అడవి శేషు "క్షణం" మూవీ లో సోలో హీరో గా విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత గూఢచారి , ఎవరు , మూవీ లతో విజయాలను అందుకొని తన రేంజ్ ను మరింతగా అడివి శేష్ పెంచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం అడవి శేషు రెండు మూవీ లలో నటించాడు. అందులో మొదటగా మేజర్ సినిమా విడుదల అయింది. ఈ మూవీ పన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. తాజాగా అడవి శేషు "హిట్ ది సెకండ్ కేస్" అనే క్రైమ్ థ్రిలర్ మూవీ లో హీరో గా నటించాడు. డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇలా అడివి శేష్ ఈ సంవత్సరం మేజర్ మరియు హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించి రెండు మూవీ లతో కూడా అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా అడవి శేషు ఈ సంవత్సరం రెండు మూవీ లతో విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: