తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ ప్రస్తుతం వారిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా ఇదే తేదీన వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల కంటే ఒక రోజు ముందు గానే కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అజిత్ హీరో గా తెరకెక్కిన తునివు మూవీ జనవరి 11 వ తేదీన విడుదల కాబోతోంది.

ఆ తర్వాత వారసుడు మూవీ విడుదల తేదీన బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ జనవరి 12 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ తర్వాత రోజు అనగా జనవరి 13 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ విడుదల కాబోతోంది  ఈ మూవీ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు ఉన్న ఇన్ని సినిమాల మధ్యలో వారసుడు సినిమా విడుదల కాబోతోంది. ఒక వేళ వారసుడు సినిమాకు కనుక మంచి టాక్ రానట్లు అయితే ఈ మూవీ కి థియేటర్ లను హోల్డ్ చేయడం దిల్ రాజు కు చాలా కష్టం అవుతుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి వారసుడు మూవీ ఏ రేంజ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: