సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సంవత్సరం మహేష్ బాబు "సర్కారు వారి పాట" మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తన తదుపరి మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ  గా రుపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ చిత్తకరణ ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అందులో భాగంగా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ రెండవ వారం నుండి రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ సెకండ్ వీక్ ప్రారంభం కావడం కష్టమే అని తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఈ మూవీ యూనిట్ మ్యూజిక్ సెట్టింగ్ లలో భాగంగా దుబాయి కి వెయ్యనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుండి తిరిగి వచ్చాక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. అందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ రెండవ పారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు లేనట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: