తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం బంగార్రాజు ,  థాంక్యూ , లాల్ సింగ్ చడ్డ అనే మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వం లో కస్టడీ అనే మూవీ లో నాగ చైతన్య హీరో గా నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ఇళయరాజా ,  యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో తేరకేకుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దూత వెబ్ సిరీస్ తో నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు , అందులో ప్రతి ఒక్క పిసోడు కూడా దాదాపు 40 నిమిషాల నిడివి తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి. ఇది ఇలా ఉంటే దూత వెబ్ సిరీస్ గురించి నాగ చైతన్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: