పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ ని తెలుగు తో పాటు తమిళ ,  హిందీ , మలయాళ , కన్నడ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ఈ అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీ ని అత్యంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలపై క్రిష్ జాగర్లమూడి అత్యంత శ్రద్ధ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ,  ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశం దాదాపు 20 నుండి 22 నిమిషాల పాటు ఉండనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: