టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా జరగబోతున్న సంక్రాంతి సినిమాల రేసు గురించి అనేక చర్చలు ఊహాగానాలు జరుగుతున్నాయి. విజయ్ నటించిన ‘వారసుడు’ డబ్బింగ్ సినిమా ‘వీరసింహారెడ్డి’ ‘వాల్టేరు వీరయ్య’ సినిమా విజయాలను శాసిస్తుందా అన్నతీరులో చర్చలు జరుగుతున్నాయి.


దీనికికారణం దిల్ రాజ్ బేకప్ వల్ల ‘వారసుడు’ సినిమాకు దాదాపు 100కు పైగా ధియేటర్లతో ఎగ్రిమెంట్ జరిగిపోయిందని వార్తలు రావడంతో చిరంజీవి బాలకృష్ణల సినిమాలకు ధియేటర్ల కష్టాలు మొదలైనట్లుగా సంకేతాలు వస్తున్నాయి. పెద్ద సిటీలలోని మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో సమస్య లేదు కానీ సింగిల్ ధియేటర్లు మాత్రమే ఉండే మీడియం రేంజ్ పట్టణాలలో ‘వారసుడు’ చిరంజీవి బాలయ్యల సినిమాలను ఎంతోకొంత శాస్తుంది అని అంటున్నారు.


ఒకవేళ చివరి నిముషంలో ‘వారసుడు’ సినిమా వెనకడుగు వేయవలసి వస్తే ‘వారసుడు’ కోసం బుక్ చేసిన ధియేటర్లు అన్నీ ‘కళ్యాణం కమనీయం’ మూవీకి వెళ్ళిపోతాయని దీనితో ఎలా చూసుకుంటున్నా సంక్రాంతి సీనియర్ హీరోల సినిమాల కలక్షన్స్ కు గండి తప్పదు అని కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇది అంతా దిల్ రాజ్ మైత్రీ మూవీస్ కు చెక్ పెట్టడానికి నడుపుతున్న వ్యవహారం అని కూడ మరికొందరు గుసగుసలు ఆడుకుంటున్నారు.


ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈవిషయమై మాట్లాడుతూ సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ సినిమాలను పక్కకు పెట్టి ఒక డబ్బింగ్ సినిమాకు ధియేటర్లు ఎక్కువగా ఇవ్వడం అంటే అది సీనియర్ హీరోలను అవమానపరచడమే అంటూ చేసిన కామెంట్స్ మరింత సంచలనంగా మారాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న విశ్లేషకులు మాత్రం మరొక విధంగా స్పందిస్తున్నారు. సంక్రాంతి రేసు కొంతమంది ప్రముఖుల మధ్య ఇగో వార్ గా మారడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. దీనితో ఒక డబ్బింగ్ సినిమా సంక్రాంతి రేస్ ను శాసించడం దానికి చిరంజీవి బాలయ్యల సినిమాలు కూడ ఎంతోకొంత నష్టపోవడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: