తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న విశాల్ "పందెం కోడి" మూవీ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని , ఆ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తన క్రేజ్ ను కూడా పెంచుకున్నాడు. అలా పందెం కోడి మూవీ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న హీరో ఆ తర్వాత నుండి దాదాపు తను నటించిన ప్రతి మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించగా , కొన్ని మూవీ లు టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

కొన్ని రోజుల క్రితమే విశాల్ "సామాన్యుడు" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ పరాజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రస్తుతం విశాల్  "లాఠీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో  విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ డైరెక్టర్ గా మారబోతున్నట్లు ప్రకటించాడు. తన ఫేవరెట్ నటుడు అయినటువంటి తలపతి విజయ్ కి కథ చెప్పి ఆయనను సినిమాకు డైరెక్షన్ చేస్తాను అని విశాల్ ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే విశాల్ , తలపతి విజయ్ హీరో గా ఒక మూవీ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం తలపతి విజయ్ వరసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: