తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాసి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన తొలి ప్రేమ మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన విధానం , వరుణ్ తేజ్ మరియు రాశి ఖన్నా లను చూపించిన విధానానికి వెంకి అట్లూరి కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. అలాగే తొలి ప్రేమ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ దర్శకుడు అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను ... నితిన్ హీరోగా రంగ్ దే మూవీ లను తెరకెక్కించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకి అట్లూరి తమిళ హీరో ధనుష్ తో సార్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. సంయుక్త మీనన్మూవీ లో ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా ఇప్పటికే పలు మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడు గా మంచి గుర్తింపును తెచ్చుకున్న వెంకి అట్లూరి మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. పూజ అనే అమ్మాయిని ఈ దర్శకుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మరియు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యలో వెంకీ అట్లూరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ దర్శకుడు తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: