కొంత మంది హీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీ లో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు ను దక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అందాల ముద్దు గుమ్మ హరి ప్రియ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తకిట తకిట ,  పిల్ల జమిందార్ ,  గలాట ,  జై సింహా , అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ వంటి పలు మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లలో నాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కిన పిల్ల జమిందార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా , నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన జై సింహా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ రెండు మూవీ ల ద్వారా హరి ప్రియ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. హరి ప్రియ తెలుగు లో ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు.

ప్రస్తుతం తెలుగు సినిమాలకు హరి ప్రియ దూరంగా ఉంటున్నప్పటికీ , ఇతర భాష మూవీ లలో మాత్రం చాలా చురుగ్గా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. హరి ప్రియ కు కే జి ఎఫ్ ఫేమ్ వశిష్ట సింహ కు తాజాగా ఎంగేజ్మెంట్ జరిగింది. వీరిద్దరి కి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలను హరి ప్రియ తాజాగా తన ఇన్స్టా లో షేర్ చేస్తూ ... మేమిద్దరం ఒకటి కాబోతున్నాం ... మీ ఆశీస్సులు కావాలి అని హరి ప్రియ రాసుకుంది. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కే జి ఎఫ్ మూవీ లో వశిష్ట సింహ , కమల్ పాత్రలో నటించాడు. ఈ పాత్ర ద్వారా వశిష్ట సింహ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: