కోలీవుడ్ లో మంచిగా సక్సెస్ అయిన తెలుగు అమ్మాయి అంజలి. 2006లో విడుదలైన తెలుగు చిత్రం ఫోటోతో అంజలి వెండితెరకు అయితే పరిచయమయ్యారు.

టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు  కూడా రాలేదు. అదే సమయంలో కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. అక్కడ టైర్ టూ హీరోయిన్ గా అంజలి బిజీ బిజీ అయ్యారు. వరుసగా అనేక తమిళ చిత్రాల్లో నటించారు. చాలా గ్యాప్ తర్వాత అంజలిని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మన పరిశ్రమకు తీసుకొచ్చాడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అంజలి హీరోయిన్ గా నటించారు. ఆమె మహేష్, వెంకటేష్ మేనత్త కూతురు పాత్ర ను చేశారు.

రాజోలుకు చెందిన అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో బాగా ఒదిగిపోయారు. ఆ మూవీలో అంజలి నటన సహజంగా ఉంటుంది. ఆ చిత్రం సక్సెస్ సాధించడంతో అంజలికి తెలుగులో ఆఫర్స్ కూడా మొదలయ్యాయి. రవితేజకు జంటగా బలుపు చిత్రం చేసింది. బలుపు సినిమా సూపర్ హిట్ అందుకుంది. అలాగే మసాలా మూవీలో మరోసారి వెంకటేష్ కి జంటగా ఆమె నటించారు.

కాగా అంజలిపై ఎఫైర్ రూమర్స్ అయితే ఉన్నాయి. కోలీవుడ్ హీరో జై తో అంజలి సీరియస్ రిలేషన్షిప్ నడిపారు. వీరిద్దరూ కలిసి ఎంగయుమ్ ఎపోతుమ్ అనే తమిళ చిత్రం కూడా చేశారు. తెలుగులో జర్నీ టైటిల్ తో విడుదలైన ఈ రొమాంటిక్ ట్రాజిక్ లవ్ ఎంటర్టైనర్ రెండు భాషల్లో కూడా విజయం అందుకుంది. శర్వానంద్ ఈ చిత్రంలో మరో హీరోగా నటించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట అనూహ్యంగా అయితే విడిపోయారు.



అంజలితో బ్రేకప్ తర్వాత జై మరొక యంగ్ హీరోయిన్ వాణి భోజన్ కి తను దగ్గరయ్యాడు. ఇక అంజలి అటు సిల్వర్ స్క్రీన్ తో పాటు డిజిటల్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. అంజలి ప్రధాన పాత్ర చేసిన ఝాన్సీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తాజాగా ఫాల్ అనే మరొక వెబ్ సిరీస్లో కూడా అంజలి నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి పెళ్లి వార్తలపై ఆమె స్పందించారు. ఇప్పటికే పలు మార్లు నాకు వివాహం జరిగినట్లు ప్రచారం అయితే చేశారు. పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లానంటూ పుకార్లు కూడా పుట్టించారు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఆ రోజు వచ్చినప్పుడు కచ్చితంగా నేను చెబుతాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: