రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత .. తండ్రి కూడా బడా ప్రొడ్యూసర్.. ఇంకా బాబాయ్ కూడా టాప్ స్టార్.. అలాంటి సినిమా వాతావరణంలో పుట్టి పెరిగిన రానా.. సినిమా రంగంలో తనకంటూ కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే కష్టపడకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఈజీ గానే వచ్చాడు. ఇక కొంత వరకు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నా.. తన పాత్రలతో బాగానే మెప్పుస్తున్నాడు.. ఈరోజు రానా 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా రానా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..


రామా నాయుడు పెద్ద కొడుకు సురేష్ బాబు, లక్ష్మీల పెద్ద కొడుకు రానా.. ఇతనికి చెల్లెలు మాళవిక, తమ్ముడు అభిరామ్ ఉన్నారు.. 1984 డిసెంబర్ 14న మద్రాసులో రానా జన్మించాడు.. అక్కడి చెట్టినాడ్ విద్యాశ్రమం ఇంకా హైదరాబాద్ నలందా విద్యా భవన్ హైస్కూలులో స్కూలింగ్ అలాగే సెయింట్ మేరీస్‌లో కాలేజ్ కంప్లీట్ చేశాడు.. 'బొమ్మలాట' అనే బాలల చిత్రానికి సహ నిర్మాతగా రానా వ్యవహరించాడు.. ఆ సినిమాకి 'బెస్ట్ ఫీచర్ ఫిలిం తెలుగు' కేటగిరీలో నేషనల్ అవార్డ్ వచ్చింది.. 'కేరాఫ్ కంచెరపాలెం', 'కృష్ణ అండ్ హిజ్ లీల', '777 చార్లీ' ఇంకా అలాగే 'గార్గి' సినిమాలకు సమర్పకుడిగా.. 'విరాటపర్వం' సినిమాకి నిర్మాతగా రానా వ్యవహరించాడు..కేవలం హీరోగానే కాదు.. రానా 'ఇన్‌ ఫెర్నో' (టామ్ హ్యాంక్స్), 'అవెంజెర్స్ : ఇన్పినిటీ వార్' & 'అవెంజెర్స్ : ఎండ్ గేమ్' (థానోస్), 'ఆర్ఆర్ఆర్' (రే స్టీవెన్ సన్), 'విన్నర్', 'సుబ్రహ్మణ్యపురం', 'లవ్ స్టోరీ' ఇంకా అలాగే 'పొన్నియిన్ సెల్వన్ : 1' వంటి సినిమాలకు డబ్బింగ్, నేరేటర్ అండ్ వాయిస్ ఓవర్ కూడా రానా ఇచ్చాడు.. అలాగే విశాల్ - తమన్నాల 'యాక్షన్' మూవీ కోసం 'లైట్స్, కెమెరా, యాక్షన్' అంటూ ర్యాప్ కూడా పాడాడు.. ఇంకా అలాగే హోస్ట్‌గానూ ఆకట్టుకున్నాడు.చాలా సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రానా తన ప్రియురాలు మిహికా బజాజ్‌ని 2020 ఆగస్టు 8న ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా వివాహం చేసుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: