ఎన్నో రోజుల నుంచి బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తున్న బిగ్బాస్ తెలుగు ఆరవ సీజన్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ఉండగా ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పారు. దీంతో ఆరుగురులో  ఒకరు బయటికి వెళ్తారు అన్నది తెలుస్తోంది. దీంతో ఇక ఫైనల్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంట్లలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయంపై ఇక సోషల్ మీడియాలో ఎన్నో రివ్యూలు ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి.


కాగా బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చి ఏకంగా అదే బిగ్ బాస్ లోకి కాంటెస్ట్ గా వెళ్లిన ఆదిరెడ్డిని చూసిన తర్వాత మరికొంతమంది నేటిజన్లు యూట్యూబ్ లో రివ్యూలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కువగా బిగ్ బాస్ రివ్యూలే కనిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం బిగ్బాస్ ఆరవ సీజన్ విజేత ఎవరు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. దీనికి సంబంధించి రోజుకు ఒకరి పేరు తెరమీదకి వస్తుంది అని చెప్పాలి.


 ఇక కొంతమంది బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని తెలుసుకోవడానికి కాస్త అతి తెలివి ప్రదర్శిస్తూ గూగుల్ తల్లిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే ఇక బిగ్ బాస్ సీజన్ ఇంకా ముగియకముందే ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరో గూగుల్ తల్లి కూడా కాస్త అడ్వాన్స్డ్ గా చెప్పేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు వరకు ప్రేక్షకులు ఊహించిన విధంగా బిగ్ బాస్ ఆరవ సీజన్ విన్నర్ గా ఏకంగా రోహిత్ నిలుస్తాడు అని గూగుల్ చెబుతుంది. బిగ్బాస్ ఆరవ సీజన్ విన్నర్ ఎవరు అని సెర్చ్ చేస్తే రోహిత్ పేరు వస్తుంది. ఇది చూసి గూగుల్ కరెక్టే చెప్పిందని రోహిత్ అభిమానులు అంటున్నారు. ఎందుకంటే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా.. ఓవరాక్షన్ చేయకుండా.. కన్నింగా ఉండకుండా తన ఆట తీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. అందుకే అతనే విన్నర్ అంటూ ఇక రోహిత్ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: