రవితేజ మరియు శ్రీలీల జంటగా నటించిన ధమాకా మూవీ ట్రైలర్ ను చిత్రబృందం కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన ఎవరికైనా ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం రవితేజ మార్క్ మాస్ డైలాగులతో రక్తి కట్టించాడు. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో రవితేజ రియల్ లైఫ్ లో జరిగిన మొత్తం కథను ఒకే ఒక డైలాగు లో చెప్పించిన వైనం ఎందరినో ఆకట్టుకుంటోంది. రవితేజ మాట్లాడుతూ... నేను వెనక ఉన్న వాళ్ళని చూసి ముందుకు వచ్చినవాణ్ణి కాదురోయ్... వెనుక ఎవరూ లేకపోయినా ముందుకు రావచ్చి అని ఒక ఉదాహరణ సెట్ చేసినవాడ్ని అంటూ పలికిన డైలాగు కు థియేటర్ లో ఒక రేంజ్ లో గోల చేయడం ఖాయంగా తెలుస్తోంది.

"ధమాకా"కు డైరెక్టర్ గా నేను లోకల్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ను అందించిన నక్కిన త్రినాధరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారని తెలుస్తోంది. రవితేజ ఫ్యాన్స్ ను బేస్ చేసుకుని పక్కా మాస్ మసాలా కంటెంట్ ను ప్లాన్ చేశాడట డైరెక్టర్. ఇక ఈ ట్రైలర్ కు ముందే ధమాకా నుండి వచ్చిన అన్ని సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన భీమ్స్ సిసిరిలో అద్భుతమైన స్వరాలను పాటలకు అందించాడు. ముఖ్యంగా ఎవరి ఫేవరెట్ మ్యూజిక్ లిస్ట్ చూసినా జింతాక జింతాక, వాట్స్ హ్యాపెనింగ్ , మాస్ రాజా పాటలు ఖచ్చితంగా ఉంటున్నాయి.

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేసుకుంటూ రాణిస్తున్న భీమ్స్ కు ఈ సినిమా మ్యూజిక్ తో మరికొన్ని ఆఫర్ల లను అందించడం ఖాయంగా తెలుస్తోంది. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ధమాకా థియేటర్ లలోకి రానుంది. ఈ గ్యాప్ లో రేపు విడుదల కానున్న అవతార్ సీక్వెల్ మినహా మరే సినిమా లేకపోవడంతో కలెక్షన్ లకు కూడా ఢోకా ఉండదు. మరి రవితేజకు వరుసగా రెండు ప్లాప్ ల తర్వాత రానున్న మూవీ కావడంతో మాస్ రాజాకు ఖచ్చితంగా హిట్ కావాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: