తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని ఖ్యాతిని సంపాదించారు నందమూరి తారక రామారావు . స్టార్ హీరోగా వెలుగొంది ఏకంగా తెలుగు వారి ఖ్యాతిని ఎల్లలు దాటించారు అని చెప్పాలి. అందుకే ఆయన భౌతికంగా దూరమైన ఇప్పటికి ప్రేక్షకుల మదిలో మాత్రం ఆయన స్థానం పదిలంగానే ఉంది. అయితే ఇక ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే ఎన్టీఆర్ తో సమానంగా స్టార్ డమ్ కొనసాగించారు ఎస్వీ రంగారావు. ఇప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో చిన్న చూపు చూస్తున్నారు.  కానీ ఒకప్పుడు మాత్రం అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితో సమానంగానే పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ ఉండేది.


 కాగా ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన నందమూరి తారక రామారావు.. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించి స్టార్ గా ఎదిగిన ఎస్వీ రంగారావు ఎంతో గొప్ప అనుబంధం ఉండేది అని చెప్పాలి. ఏకంగా ఎస్.వి.రంగారావు ఎన్టీఆర్ను తమ్ముడు అని ప్రేమగా పిలిచేవారు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా ఎస్వీ రంగారావును అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించేవారు అని చెప్పాలి. ఇలా మంచి స్నేహితులుగా ఏకంగా ఒక్క తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లాగా ప్రత్యేకమైన బంధం కలిగి ఉన్న ఎన్టీఆర్,ఎస్వీ రంగారావు మధ్య వచ్చిన విభేదాలు అప్పట్లో ఇండస్ట్రీని ఉపేసాయ్.


 అయితే ఇప్పటికి కూడా ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు మధ్య వచ్చిన వివాదాలకు కారణం ఏంటి అన్నది కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ వివరాలు చూసుకుంటే.. ఒక సినిమాలో ఎన్టీఆర్ రాజకుమారుడు వేషం వేశారు. సినిమాలో రాజకుమారుడు గుర్రంపై వేటకు వెళ్లే సీన్ ఉంటుంది. ఆ సీన్ కోసం మొదట అరేబియన్ గుర్రాన్ని తీసుకువచ్చారట. ఆ గుర్రం ఎంతో పొగరుగా ఉండేది. స్వారీ చేసే వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టేదట. అయితే అప్పటికే ఎస్ వి రంగారావు కి గుర్రపు స్వారీ చేయడంలో పట్టు ఉంది. సొంతంగా గుర్రాలు కూడా ఉండేవి. దీంతో ఎన్టీఆర్ స్వారీ కోసం ఎస్వీఆర్ సలహా అడిగారట. దీంతో వెంటనే ఎప్పుడు గుర్రపు పందాలకు వెళ్లలేదా అని సెటైరికల్ గా మాట్లాడడంతో ఎన్టీఆర్ హర్ట్ అయ్యారట. కొన్నాళ్లపాటు  మాట్లాడుకోలేదట. కానీ ఆ తర్వాత ఎస్ విఆర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి స్వయంగా గుర్రపు స్వారీ నేర్పించారట. అప్పటినుంచి ఎన్టీఆర్ ప్రతి సినిమాలో గుర్రపు స్వారీ సీన్లు ఉండేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: