జూనియర్ సమంత గా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఆశు రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కి వెళ్లిన అనంతరం వెండితెరపై కూడా అనేక ఆఫర్లను పొందింది. ఎప్పటికప్పుడు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాలలో కూడా నటించే అవకాశాలను పొందుతుంది. ఇక వెండి తెర ప్రయత్నాలలో భాగంగా ఈమె సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకొని సిల్వర్ స్క్రీన్ వరకు వెళ్లాలి అని భావిస్తుంది.అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈమె అనుకుంది సాధించింది. 

త్వరలోనే జూనియర్ సమంత హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందట.యంగ్ హీరో అయిన అరవింద్ కృష్ణ తాజాగా ఒక సినిమాని ప్రారంభించాడు. ఏ మాస్టర్ పీస్ అనే టైటిల్ తో సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా కొత్త తెలుగు సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ కనపడనున్నాడు. సుకు పూర్వజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆశు రెడ్డిని హీరోయిన్గా అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తోందని తెలుస్తోంది.ఇక ఇప్పటికే విడుదలైన సస్పెన్స్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేసిన ఏ మాస్టర్ పీస్ టైటిల్ లుక్ పై అంచనాలు పెరిగిపోయాయి. 

ఇక ఈ సినిమాలో ధ్య అనే పాత్రలో ఆశు రెడ్డి నటిస్తోందట. యాక్టింగ్ తో పాటు గ్లామర్ కు కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో ఈమె నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈమె ఇంటర్వ్యూలు, షోలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా ఈమె మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: