టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటువంటి నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , పల్నాటి సూర్య ప్రతాప్మూవీ కు దర్శకత్వం వహించాడు. గోపి సుందర్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతోంది. 

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి 18 పేజెస్ మూవీ యూ / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మంచి అంచనాలు కలిగి ఉన్న 18 పేజెస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం కార్తికేయ 2 మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ 18 పేజెస్ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో లేదో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: