
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిసి సినిమాపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎస్ఎస్ తమన్ అందిస్తూ ఉండగా. ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్.. సినిమాటోగ్రఫీ కార్తీకపళని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగు 2022 ఏప్రిల్ లో చెన్నైలో ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే పొంగల్ సందర్భంగా విడుదల చేయాలనుకున్న దర్శక నిర్మాతలు అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు తెలుగు , తమిళ్ భాషలలో 2023 జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కాబోతోంది.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈనెల 24వ తేదీన ఆడియో లాంచ్ తో పాటు టీజర్ కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 24న ఆడియో లాంచ్ అలాగే 31వ తేదీన టీజర్ లేదంటే ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరో మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీపడుతున్న వారసుడు సినిమా సంక్రాంతి పోటీలో విజయాన్ని దక్కించుకుంటూ లేదో చూడాలి.