మాస్ మహారాజా రవితేజ తాజాగా ధమాకా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పెళ్లి సందD సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్న శ్రీ లీల హీరోయిన్ గా నటించగా , సినిమా చూపిస్త మామ , నేను లోకల్ వంటి మంచి విజయవంత మైన సినిమా లకు దర్శకత్వం వహించిన త్రినాధ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమా పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధమాకా మూవీbకి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క హిందీ డబ్బింగ్ రైట్స్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క హిందీ డబ్బింగ్ రైట్స్ ఇప్పటికే 20 కోట్లకు అమ్ముడు పోయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రవితేజ ఇప్పటికే ఖి ,  రామారావు అన్ డ్యూటీ అనే మూవీ లతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. మరి ధమాకా మూవీ తో రవితేజ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: