‘కార్తికేయ 2’ తో 100 కోట్ల హీరోగా మారిన నిఖిల్ నటించిన ’18 పేజెస్’ ఈవారం విడుదలకాబోతోంది. మాస్ మహారాజా రవితేజా ‘థమాక’ తో పోటీగా విడుదల కాబోతున్న ఈ మీడియం రేంజ్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకున్న ఈమూవీ కథ చాల డిఫరెంట్ గా ఉంటుంది అన్నప్రచారం జరుగుతోంది.


ఈమూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఒక మంచి ఉద్యోగం చేసే నిఖిల్ కు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నుండి ఫోన్ వస్తుంది. ఆ అమ్మాయిది 1990ల నాటి మైండ్ సెట్ ఆలోచనలు సున్నితంగా ఉంటాయి. ఫేస్ బుక్ లాంటివి వాడటం అసలు తెలియదు. క్రమంగా ఇష్టం ప్రేమగా మారుతుందట. అయితే హీరోయిన్ జీవితంలో ఒక ప్రమాదం ఉందని తెలుసుకుని ఆ ప్రమాదానికి ఆమె దగ్గర ఉన్న డైరీకి లింక్ చేస్తూ లవ్ స్టోరీ నేపధ్యంలో నడిచే ఒక సస్పెన్స్ కథ అని అంటున్నారు.



ఈమూవీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది అంటున్నారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో నడిచే ఈకథలో చాల ట్విస్ట్ లు ఉన్నాయి అంటున్నారు. దీనితో ఈమూవీ ఇప్పటి వరకు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అందరూ అనుకుంటూ ఉంటే ఈమూవీ ఒక్కసారిగా థ్రిల్లర్ మూవీగా మారిపోయిందా అనిపిస్తోంది. దీనితో ఈకథ ఎక్కడో ప్రారంభం అయి ఎక్కడో ముగుస్తుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.



ఇలాంటి కథలలో ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉన్నా ప్రేక్షకులకు అసహనం కలిగించే ఆస్కారం ఉంది. ఈమూవీలో ప్రేమ పోరాటం లాంటి అనేక భావోద్వేగాలతో పాటు హీరోయిన్ డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ సమ్మర్ లో స్వెట్టర్ వేసుకోవడం లాంటి విచిత్రాలు కూడ ఉన్నాయట. మరి ఇలాంటి విచిత్రాలు ఉన్న ఈమూవీ ఒక మాస్ మూవీతో పోటీ పడుతున్న పరిస్థితులలో రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది అంచనా వేయడం కష్టం అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: