మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు.  ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నారు.  కేవలం ఒక్క ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా ఈయనకు ఇప్పుడు అభిమానులు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు.

ఇకపోతే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహాలు చేసుకుని పిల్లలకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  దీంతో దాదాపు పది సంవత్సరాలు పాటు వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేసిన వీరు.. ఇటీవల తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ను ఉపాసన వివాహం చేసుకున్నప్పుడు ఎంత కట్నం ఇచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలో కి వెళితే.. అపోలో చైర్పర్సన్ ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు రామ్ చరణ్.

కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఇక ఆ సమయంలో రామ్ చరణ్ కి ఉపాసన కుటుంబ సభ్యులు కట్నం కింద రూ.300 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  వీటితోపాటు అపోలో హాస్పిటల్ లో  రామ్ చరణ్ కు వాటా కూడా ఇచ్చారట. కొన్నివేల కోట్ల ఆస్తులకు వారసురాలు అయిన ఉపాసనను రాంచరణ్ వివాహం చేసుకోవడం నిజంగా ఆయనను మరింత పదిలం చేసింది ఇప్పటికే తన తండ్రి పేరు మీద రూ. 1700 కోట్లు ప్రాపర్టీ ఉండగా.. ఆయన పేరు మీద సుమారుగా రూ.1200 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదనంగా ఉపాసన ప్రాపర్టీ కూడా వీరి సొంతం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: