తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ ప్రస్తుతం వారసు అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తలపతి విజయ్ "బీస్ట్" మూవీ తో ఈ సంవత్సరం ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. కానీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ మంచి విజయం అందుకుంది. 

ఇది ఇలా ఉంటే వారిసు మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పోస్టర్ లను విడుదల చేసింది. 

మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన వారసుడు మూవీ తెలుగు పోస్టర్ లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా అంటే ఫుల్ క్రేజ్ ఉన్న ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ నుండి మూడవ పాటను చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: