తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తలపతి విజయ్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ,  తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మాణం లో రూపొందుతున్న వారిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. వారసుడు మూవీ కి తెలుగు లో కూడా భారీ ప్రమోషన్ లను నిర్వహించే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ వేడుకక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ సినిమాపై తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత బజ్ ను క్రియేట్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: