జేమ్స్ కామెరూన్ అధ్బుతాల్లో ఒకటి అవతార్..ఈ సినిమాను వండర్ విజువల్స్ తో ఈ సినిమాను రూపొందించారు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా మరో సినిమాను అవతార్ 2 ను విడుదల చేశారు.. తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ను అందుకుంది.. ఈ నెల 16న విడుదలైన ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తోంది.


మూడే రోజుల్లో రూ. 3600 కోట్ల వసూలు చేసి కేక పుట్టిస్తోంది. సముద్రం అడుగున వింతవింత జీవులతో, 'కార్తీకదీపం' సీరియల్‌ను తలదన్నే ఫ్యామిలీ సెంటిమెంటుతో, గగుర్పొడిచే అందమైన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వనిఈ మూవీ వసూళ్ల వివరాలు చూస్తే..మన దేశంలో అవతార్ 2 ఇప్పటి వరకు రూ. 130 కోట్లు కొల్లగొట్టింది. శుక్రవారం 41 కోట్లు, శనివారం 42 కోట్లు, దాదాపు 45 కోట్లు వసూలు చేసింది. ఇటీవల విడుదలై భారీ వసూళ్లు రాబడుతున్న హాలీవుడ్ మూవీ 'డాక్టర్ స్ట్రేంజ్'ను కూడా నీలిరంగు మనుషులు వెనక్కి నెట్టేశారు. డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం మన దేశంలో విడుదలైన మూడు రోజుల్లో రూ.126 కోట్ల కలెక్షన్లు సాధించగా అవతార్ ఆ మార్క్ దాటేసింది.తొలి రోజునుంచే రికార్డులు బ్రేక్ చేస్తోంది అవతార్ 2.


ఈ విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే అవతార్ 2 విడుదలకు ముందే పలు వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చింది. పైరసీ అయినా కూడా ఈ కు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఇక తొలిరోజే రికార్డులను క్రియేట్ చేసింది అవతార్ 2. జేమ్స్ కామెరూన్ అవతార్ 2తో మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. విజువల్ వండర్ గా ఈ ను తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 సంచలనాలు సృష్టిస్తుంది.ఈ పై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: