తాజాగా నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ అండ్ త్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించడం జరిగింది. అయితే ఈ వేడుకలో భాగంగా అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. అయితే 18 పేజెస్ సినిమా నాకు కెరియర్ ఇచ్చిన సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో వచ్చింది. అంతేకాదు సుకుమార్ నిర్మాతగా మరియు నా ఆప్తుడు బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించారు. 

అయితే ఈ కారణం తోనే పిలవగానే ఈవెంట్ కి నేను రావడం జరిగింది. అంతేకాదు ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్గా నటించిన నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ లపై ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూ ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయాన్ని అందుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో భాగంగానే సుకుమార్ ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .అయితే అల్లు అర్జున్.... అందరూ పుష్ప అప్డేట్ ఎప్పుడూ అని అడుగుతున్నారు కానీ ఇప్పటివరకు ఇలాంటి అప్డేట్ లేదు

 ఆయన నిర్మాతగా ఉన్న 18 పేజెస్ దర్శకుడిగా 118 పేజెస్ అవుతుంది. అంతేకాదు త్వరలో పుష్ప 2  సినిమా అప్డేట్ కూడా వస్తుందని లేదంటే నేను షూటింగ్ లో చెబుతున్న డైలాగ్స్ అన్నీ కూడా బయట పెట్టేస్తాను అంటూ సుకుమార్ కి స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చాడు అల్లు అర్జున్.అంతేకాదు సుకుమార్ నాకు చాలా క్లోజ్ నేను ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే పుష్ప 2  ఎంత లేట్ అయినా ఆయన్ని నేను ఏమనను. పుష్ప 2  సినిమా ఎలా ఉంటుంది అంటే అసలు తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ పుష్ప 2  సినిమా అప్డేట్ పై చేసిన వ్యాఖ్యలు కాస్త  ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: