మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయన తార ఇప్పటికే ఎన్నో భాషల మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే నయన తార ఇప్పటికే ఎన్నో టాలీవుడ్ మూవీ లలో హీరోయిన్ గా మరియు ఇతర పాత్రలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా తెలుగు లో నయన తార , మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మూవీ ద్వారా నయన తార కు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నయన తార తమిళ మూవీ లలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. దానితో ప్రస్తుతం నయన తార తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే నాయన తార తాజాగా కనెక్ట్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అశ్విన్ శరవనన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన తమిళ మరియు తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఇంటర్వెల్ లేకుండానే థియేటర్ లలోకి తీసుకురాబోతున్నారు. దీనితో తమిళ సినీ థియేటర్ యజమానులు ఇంటర్వెళ్ లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ వల్ల వచ్చే ఆదాయం కోల్పోయే కారణంతో ఈ మూవీ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: