టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ గా  గుర్తింపు తెచ్చుకున్న అలీ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా... దాని తర్వాత స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. నిన్న మొన్నటి వరకు వచ్చిన అన్ని సినిమాలలో బ్రహ్మానందం, వేణుమాధవ్ వంటి కమెడియన్లు లేకుండా ఒక్క సినిమా కూడా లేదు. ఇక వీళ్ళ క్రేజ్ ని బట్టి చాలామంది దర్శక నిర్మాతలు వీళ్లను వాళ్ళ సినిమాలో పెట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. అయితే ఈ క్రమంలోని కమెడియన్ గానే

 కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించడం జరిగింది.  ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టీవీ కి అతుక్కుపోతుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వెండి తెరపైనే కాకుండా అలీ బుల్లితెరపై కూడా అలీతో సరదాగా అనే షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇక ఎప్పుడూ బయటికి నవ్వుతూ పదిమందిని నవ్వించే అలీ జీవితంలో ఒక విషాద గాధ ఉందని తెలుస్తుంది. అయితే అలి గతంలో ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాని

 ఆ అమ్మాయి ఓ రోజు వర్షం పడుతుండగా వర్షంలో తడుచుకుంటూ వెళుతుందని ఆ సమయంలో ఆమె రోడ్డుపై అలా వెళ్లడం చూసి ఇష్టం లేని అలీ ఎదురుగా వెళ్లి గొడుగు ఇచ్చాడట. అయితే ఈ క్రమంలోనే వారి ప్రేమ చిగురించిందని దాని అనంతరం వారి ప్రేమ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మకి నచ్చలేదని దాంతో వారు ప్రేమని వదులుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని అలి ఆయన షోలో చెప్పడం జరిగింది. దీంతో అలీ ప్రేమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: