లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాది సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నయనతార తాను నటించిన సినిమాల ప్రమోషన్ కు కూడ రాదు. ఫిలిం ఫంక్షన్స్ కు చాల దూరంగా ఉండే ఈమె ఇప్పుడు ‘కనెక్ట్’ అనే ఒక హారర్ మూవీని ప్రమోట్ చేస్తోంది. తెలుగు తమిళ భాషలలో విడుదల కాబోతున్న ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో నయన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది.


ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ లో ఆమెకు మీడియా వర్గాల నుండి ఎదురైన ఒక ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చింది. తాను ఇప్పటివరకు తన కెరియర్ లో ఏభారీ సినిమా ప్రమోషన్ కు రాకుండా ఎందుకు దూరంగా ఉండవలసి వచ్చిందో వివరించింది. సినిమా కథలో హీరోకి హీరోయిన్ కి సమాన ప్రాధాన్యత ఉంటుందని అయితే ఆ సినిమా ప్రమోషన్ లో హీరోయిన్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఫంక్షన్ కు వచ్చిన అందరూ హీరోల భజన చేస్తూ హీరోయిన్ ను ఎక్కడో మూల నిలబడుతూ ఉంటారని అలాంటి పరిస్థితులను చూసి తనకు చికాకుకలిగి తాను సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నాను అంటూ కామెంట్ చేసింది.


అంతేకాదు ఒక సినిమాకు సంబంధించిన ఎంత గొప్ప కథ అయినప్పటికీ హీరోయిన్ పాత్ర లేకుండా సినిమా తీయగలరా ఒకవేళ అలాంటి సినిమాను తీస్తే జనం చూస్తారా అంటూ ఆమె ప్రశ్నిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం అంత సులువైన పని కాదనీ అలాంటి సినిమాలలో నటించి మెప్పించాలి అంటే ఆ హీరోయిన్ కు నటనలో ఎంతో సమర్థత ఉండాలి అని అంటోంది.


ఇండస్ట్రీలో హీరోయిన్స్ పట్ల చిన్నచూపు ఎప్పటినుంచో కొనసాగుతున్న వ్యవహారమే అయినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న నేపద్యంలో హీరోయిన్స్ వ్యక్తిత్వాన్ని ఎందుకు గుర్తించరు అంటూ ఆమె ఎదురు ప్రశ్నలు వేస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: