టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన కలిసి జంటగా నటించిన గీతాగోవిందం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు గడిచినప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమాని విజయ్ దేవరకొండ 

ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఈ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఆయనలోని కమెడియన్ ని కూడా బయట పెట్టాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి వసూళ్లను రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖులు సైతం చూడడం జరిగింది. దీంతో ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనం చూడొచ్చు. ఇక అప్పట్లో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం అప్పట్లో విజయ్ దేవరకొండ ని మెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమా విడుదల అనంతరం నిర్మాతలైన అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు లాభాలను మూటగట్టుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై విడుదలైన ఐదు రోజులకే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 33 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ సినిమా ఐదు కోట్ల వసూళ్లను రాబట్టింది.ఇండియా మొత్తంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందట .దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: