లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ తో తమిళంలో సూపర్ ఫాం కొనసాగిస్తున్న నయనతార తెలుగులో కూడా వచ్చిన ప్రతి ఛాన్స్ వాడేస్తుంది. సినిమాలైతే చేస్తుంది కానీ ప్రమోషన్స్ అంటే నా వల్ల కాదంటుంది నయన్. అయితే రీసెంట్ గా అశ్విన్ శరవణన్ డైరెక్షన్ లో తన భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో కనెక్ట్ అనే సినిమా చేసింది నయనతార. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయనతార. 99 నిమిషాఒల ప్రయోగాత్మక సినీమగా వచ్చిన ఈ కనెక్ట్ సినిమాపై నయన్ చాలా హోప్స్ పెట్టుకుంది.

తను ఎలాంటి సినిమా తీసినా ప్రేఖకులు ఆదరిస్తారని నమ్మింది. తమిళంలో ఏమో కానీ తెలుగులో మాత్రం నయనతార సినిమా సీన్ రివర్స్ అయ్యింది. నయనతార లీడ్ రోల్ లో సినిమాకు తెగాల్సిన టికెట్లు తెగలేదు. అంతేకాదు సండే ఈవెనింగ్ షో ప్రసాద్ ఐమ్యాక్స్ లో కానీసం పది మంది కూడా లేరని టాక్. ఇది ఓ రకంగా నయనతారకు అవమానకరమే అని చెప్పొచ్చు. కనెక్ట్ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవడంతో విఫలమైంది. సినిమాలో మ్యాటర్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.

నయనతార మాత్రం తెలుగు ఆడియన్స్ తనని పక్కాగా ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. అంతేకాదు ఎప్పుడూ లేనిది ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఒకటి చేసింది. అయినా సరే ఉపయోగం ఏమీ లేకుండాపోయింది. నయన్ ఇంత కష్టపడినా సరే కనెక్ట్ సినిమా డిజాస్టర్ గా మారింది. బడ్జెట్, కాస్టింగ్ తక్కువే కాబట్టి ఫైనల్ గా ప్రాఫిట్స్ వచ్చాయేమో కానీ థియేట్రికల్ రన్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. నయనతార తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా ఒక్క సినిమా ప్రమోషన్స్ కి వచ్చింది లేదు కానీ ఇప్పుడు సొంత సినిమా అయ్యే సరికి ఆమె స్పెషల్ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. లేదంటే ఆమె సినిమాని ఆమాత్రం పట్టించుకునే వారు కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: