తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి ఆది సాయి కుమార్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ కావాలి మూవీ తో హీరో గా పరిచయం అయిన ఆది ఆ తరువాత అనేక మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆది అనేక మూవీ లలో హీరో గా నటిస్తున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆది "టాప్ గేర్" అనే సస్పెన్స్  థ్రిల్లర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ... వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. 

సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 27 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హోటల్ దస్పల్ల ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని కె వి శ్రీధర్ రెడ్డి నిర్మించారు. రియా సుమన్మూవీ లో ఆది సాయి కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. మరి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ తో అయిన ఆది సాయి కుమార్ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడు లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: