మాస్ మహారాజా రవితేజ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలతో పూర్తిస్థాయిలో నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలాగైనా సరే విజయాన్ని సాధించాలని ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతోంది. ఇప్పటికే కనెక్షన్ల పరంగా భారీ విజయాలను అందుకుంటోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ వసూలు చేసి అక్కడ యూకే లో కూడా ధమాకా సినిమా సత్తా చాటుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్,  అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించారు. డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారీ విజయంతో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమా లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటించడం రవితేజకు అదృష్టం అని చెప్పవచ్చు. అలాగే ఈ ఏడాది చివరికి మరో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టిన ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ హిట్ తో దూసుకెళ్తోంది.  అక్కడైతే ఏకంగా 2 లక్షల 50వేల డాలర్స్ మార్క్ ను  క్రాస్ చేసి మరింత స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది.

అంతేకాదు యూఎస్ లో డిమాండ్ మేరకు అక్కడ మరిన్ని థియేటర్స్ యాడ్ చేస్తున్నారట.  ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు పక్క మాస్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. ఈరోజు సాయంత్రం హైదరాబాదులో ధమాకా సినిమా మాస్ ఈవెంట్ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ
సినిమా రవితేజకు భారీ విజయాన్ని అందించింది.  ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా గెస్ట్ గా నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.A

మరింత సమాచారం తెలుసుకోండి: