సెకండ్ జనరేషన్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హీరోలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ కూడా చిరంజీవి , బాలకృష్ణ మధ్యనే ఎక్కువ పోటీ ఉంటుంది. ఎన్నోసార్లు చిరంజీవి, బాలకృష్ణ మధ్య గట్టి పోటీ ఏర్పడిందనే విషయం చాలామందికి తెలిసిందే. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటారు. ఇప్పటివరకు కేవలం సంక్రాంతి రోజు మాత్రమే ఎనిమిది సార్లు.. ఇతర సందర్భాలలో ఐదు సార్లు ఈ స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగాయి.

మొదటిసారి 1984లో బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు.. చిరంజీవి నటించిన ఇంటిగుట్టు చిత్రాలు మూడు రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ రెండింటిలో కూడా సుహాసిని హీరోయిన్గా నటించింది.  అయితే మంగమ్మగారి మనవడు సూపర్ హిట్ అయ్యి ఆమెకు మంచి గుర్తింపు అందించింది. ఆ తర్వాత 1984 లోనే డిసెంబర్లో బాలకృష్ణ,  చిరంజీవి కథానాయకుడు, రుస్త్రుం సినిమాలతో పోటీ పడి చిరంజీవి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు..

ఇక అలా ప్రతి ఏడాది వీరిద్దరూ సంక్రాంతి బరిలో పోటీ పడేవారు.  అలా చివరిగా 2017 వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పోటీపడ్డ వీరిద్దరూ.. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి.. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలతో సంక్రాంతి పండుగకు పోటీపడ్డారు. అయితే రెండు చిత్రాలు కూడా విజయం సాధించాయి. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల తర్వాత వీరిద్దరు మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో,  బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. ఇకపోతే రెండు సినిమాల నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య సినిమాకు భారీ ఫాలోయింగ్ పెరిగింది.  దీన్ని బట్టి చూస్తే ఈసారి కూడా చిరంజీవి పై చేయి సాధించబోతున్నారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: